Benjamin Netanyahu: పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం!
ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) సంచలన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ‘మరణశిక్ష’ బిల్లుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది సభ్యులు ఉన్న నెస్సెట్ లో ఈ బిల్లుకు 62 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా, దేశీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సోమవారం ఆమోదం పొందిన ఈ చట్టం 30 రోజుల్లో అమలులోకి వస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఉగ్రవాద చర్యలో భాగంగా ఇజ్రాయెలీ పౌరులను హత్య చేసిన పాలస్తీనియన్లకు మరణశిక్ష విధిస్తారు. ఇదే నేరం చేసి పట్టుబడ్డ ఇజ్రాయెలీ పౌరులకు మాత్రం ఇదే శిక్ష విధించే వీలులేదు. దీంతో ఇది కేవలం పాలస్తీనియన్లను అణచివేసేందుకే తీసుకొచ్చిన చట్టమని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లును ప్రధాని నెతన్యాహు గట్టిగా సమర్థించారు. ‘‘ఉగ్రవాదులకు జైళ్లలో చోటు లేదు, వారికి మరణమే సరైన శిక్ష’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ భద్రత కోసం ఈ చట్టం అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ బిల్లుపై ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు విరుద్ధమని, పశ్చిమాసియాలో హింసను మరింత పెంచుతుందని హెచ్చరించాయి. మరోవైపు, ఈ చట్టాన్ని పాలస్తీనా అథారిటీ ‘‘జాతి నిర్మూలన’’ ప్రయత్నంగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వర్ణవివక్షకు ఇది పరాకాష్ట అని మండిపడింది.
సాధారణంగా ఇజ్రాయెల్‌లో నేరాలకు మరణశిక్ష విధించే సంప్రదాయం లేదు. 1962లో నాజీ నేరస్థుడు అడాల్ఫ్ ఐచ్‌మాన్‌కు మాత్రమే అక్కడ మరణశిక్ష అమలు చేశారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చట్టం తీసుకురావడంపై ఇజ్రాయెల్‌లోని ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీనిపై ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.