Chennai Super Kings: చెత్తగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు బ్యాటర్లు ఒక్కరొక్కరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణయం సరైనదని వారి బౌలర్లు నిరూపించారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెన్నై వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), సంజూ శాంసన్ (6), ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) ఇలా టాపార్డర్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 41 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) కాసేపు నిలబడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

ఈ దశలో ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఓవర్టన్ రనౌట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. రాజస్థాన్ బౌలర్లు 16 ఎక్స్ ట్రాలు ఇవ్వడంతో చెన్నైకి ఆమాత్రం స్కోరైనా వచ్చింది. 

రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. 
Chennai Super Kings
CSK
Rajasthan Royals
IPL 2026
Jofra Archer
Ruturaj Gaikwad
Jamie Overton
Indian Premier League
Cricket
Batting Failure

More Telugu News