CR Patil: లక్ష కోట్ల ప్రజాధనం వృథా: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, లక్ష కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలు కారణమని అన్నారు.

కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. కాగా, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఇంకా మాట్లాడుతూ, జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళుగా ఒక్క ప్రతిపాదన పంపించలేదని అన్నారు. తెలంగాణ వద్ద జల్ జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు.
CR Patil
Kaleshwaram Project
Telangana
Jal Shakti Ministry
National Project
BRS
Suresh Reddy

More Telugu News