Chandrababu Naidu: నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ... ఓ ఇంటికి గుమ్మడికాయ కట్టిన సీఎం చంద్రబాబు... ఫొటో రౌండప్!
రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన 2.5 లక్షల టిడ్కో ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొని ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన లబ్ధిదారులతో కలిసి వారి కొత్త ఇళ్లలోకి ప్రవేశించి శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా ముఖ్యమంత్రి, లబ్ధిదారురాలైన ముక్కర అంబిక ఇంటికి వెళ్లి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం, మరో లబ్ధిదారురాలైన షేక్ నూరి ఇంటికి వెళ్లారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి, వారిని ఆశీర్వదించారు.
ఒకే వేదికపై హిందూ, ముస్లిం లబ్ధిదారుల ఇళ్లలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొలుసు పార్థసారధి, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ, పలువురు ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.