Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాతృవియోగంతో బాధపడుతున్న ప్రకాశ్ రాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ఒక సంతాప సందేశాన్ని పంచుకున్నారు.

"ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

సినిమా రంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్ రాజ్ ఇంట్లో జరిగిన ఈ విషాద ఘటన పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 
Prakash Raj
Prakash Raj mother
Suvarnalatha
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Condolences
Movie News
Telugu Cinema

More Telugu News