Surya Bhai: 'గోల్డ్ మ్యాన్' సూర్యా భాయ్ ధరించింది నకిలీ బంగారం అంట!
హైదరాబాద్ పాతబస్తీలో 'గోల్డ్ మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సూర్యా భాయ్ బండారం బట్టబయలైంది. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుగుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, వాస్తవానికి నకిలీ నగలు ధరిస్తున్నాడని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో తేలింది. దీంతో అత్తాపూర్‌కు చెందిన పల్లపు సురేశ్ కుమార్ అలియాస్ సూర్యా భాయ్ ఇమేజ్ ఒక్కసారిగా తలకిందులైంది.
అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే... కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యా భాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో విజయ్ కుమార్ నుంచి అధికారులు 1.4 కిలోల అసలైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించినప్పుడు సూర్యా భాయ్‌ను గుర్తించి విచారణ చేపట్టారు.
శుక్రవారం ఐటీ అధికారుల ఎదుట హాజరైన సూర్యా భాయ్, తాను ధరించిన 12 ఆభరణాల విలువ సుమారు రూ.1 కోటి అని మొదట చెప్పారు. అయితే, అధికారుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం బలపడింది. చివరికి ఆ నగలు రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని అంగీకరించారు. ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూత వేసిందని తేలింది.
యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ధనవంతుడిగా కనిపించేందుకు సూర్యా భాయ్ సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను వాడినట్లు విచారణలో వెల్లడైంది. రంగు మారినప్పుడల్లా వాటిని మార్చేవాడని తెలిసింది. ఈ ఘటనతో పాతబస్తీలో 'గోల్డ్ మ్యాన్' కాస్తా 'రోల్డ్ గోల్డ్ మ్యాన్' అయ్యాడంటూ స్థానికులు, నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
లోతైన విచారణలో సూర్యా భాయ్ ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనికి సొంత ఇల్లు లేదని, రూ.20 వేల అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని తేలింది. గత ఆరేళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేయని అతను, కేవలం 2022-23లో రూ.4.9 లక్షల ఆదాయం చూపాడు. థార్, సఫారీ వంటి వాహనాలు ఉన్నప్పటికీ, అవి కేవలం ప్రదర్శన కోసమేనని, భూవివాదాల సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన కమీషన్లతో కొన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలా 'గోల్డ్ మ్యాన్'గా ప్రచారం చేసుకున్నానని విచారణలో సూర్యా భాయ్ అంగీకరించినట్లు తెలిసింది. తాను 'గటికుడు' అనే సినిమాలో చిన్న పాత్రలో నటించానని కూడా చెప్పాడు. విచారణ అనంతరం అతడిని విడిచిపెట్టినప్పటికీ, ప్రధాన సూత్రధారి అయిన విజయ్ కుమార్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.