Ranveer Singh: 'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్

Dhurandhar Movie Success Lyari People Demand Share
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విజయం ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో తమ ప్రాంతం పేరును ఉపయోగించుకున్నందుకు, సినిమా ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలంటూ పాకిస్థాన్‌లోని ల్యారీ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరాచీలోని ల్యారీ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కింది. 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో భారత ఏజెంట్ ఒకరు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ఎలా నాశనం చేశాడన్నదే కథాంశం. తమ నగరం పేరును వాడుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారని, కాబట్టి ఆ ఆదాయంలో కొంత భాగాన్ని తమ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని ల్యారీ వాసులు కోరుతున్నారు.

ఈ డిమాండ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రాంతాన్ని వాడుకున్నందుకు చిత్ర నిర్మాతలు బాధ్యత వహించాలని వారు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది.

Go Back to Shorts
Ranveer Singh
Dhurandhar The Revenge
Bollywood
Lyari Pakistan
Pakistan
Action Thriller
Aditya Dhar
Box Office Collection
Terrorism

More Telugu News