US Central Command: ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా
ఇరాన్‌తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుతూ 3,500 మంది మెరైన్లు, నావికులతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను మోహరించింది. ఈ బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంటకామ్) శనివారం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకపై ఈ బలగాలు సెంటకామ్ బాధ్యతలు నిర్వర్తించే ప్రాంతానికి వచ్చాయని తెలిపింది. ఈ బృందంలో దాదాపు 3,500 మంది సైనికులతో పాటు, రవాణా, ఫైటర్ విమానాలు, దాడులకు అవసరమైన ఇతర యుద్ధ సామాగ్రి కూడా ఉన్నాయి. సముద్రం నుంచి, నేలపై నుంచి ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఈ బలగాలకు ఉంది. వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తీరప్రాంత లక్ష్యాలపై దాడులు చేయడం వంటి వేగవంతమైన ఆపరేషన్ల కోసం ఈ తరహా యూనిట్లను ఉపయోగిస్తారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్యానికి మరో 10,000 మంది సైనికులను పంపే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దౌత్య మార్గాలతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ బలగాలను ఇరాన్‌కు సమీపంలో, ముఖ్యంగా ఆ దేశానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై దాడికి వీలుగా ఉండే ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.