Venkatesh: వికారాబాద్ పెట్రోల్ దాడి: చికిత్స పొందుతూ సర్పంచ్ కుమారుడు మృతి

వికారాబాద్ జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన పెట్రోల్ దాడి ఘటన విషాదాంతమైంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సర్పంచ్ కుమారుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన పినతల్లి రూప్‌సింగ్ తండా సర్పంచ్ రమణిబాయ్ పరిస్థితి విషమంగా ఉంది.
 
వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం రూప్‌సింగ్ తండాకు చెందిన అమర్ సింగ్ అనే వ్యక్తి ఆస్తి వివాదాల నేపథ్యంలో తన తండ్రి, పిన తల్లి (సర్పంచ్ రమణిబాయ్) కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

ఈ ఘటనలో రమణిబాయ్, ఆమె కుమారుడు వెంకటేశ్‌‌లు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ మృతి చెందాడు. సర్పంచ్ రమణిబాయ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Venkatesh
Vikarabad
Petrol Attack
Sarpanch Ramani Bai
Roop Singh Thanda
Property Dispute
Amar Singh
Gandhi Hospital Hyderabad
Crime News Telangana

More Telugu News