Revanth Reddy: భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల 'ప్రజాపాలన' ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఈ సభను నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రను ఇదే గ్రామం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొననున్నారు.
తన పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బాసరకు చేరుకుంటారు. అక్కడ సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేసి, గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పిప్రి గ్రామంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి, సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
ఈ సభ ఏర్పాట్లపై శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే అధికారంలోకి వచ్చాక తప్పకుండా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 'భూభారతి' చట్టం తెచ్చి అసైన్డ్ భూములకు చట్టబద్ధ హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న కొమురం భీమ్ ప్రాజెక్టు కాలువలను వెంటనే పూర్తి చేయాలని, గిరిజనులకు స్వయం ఉపాధికి వడ్డీ లేని రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.