ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

Asaduddin Owaisi Angry Over Dhurandhar 2 Movie
  • కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణ
  • ఇది ఒక అర్థం లేని సినిమా అని మండిపాటు
  • దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ
ధురంధర్-2 సినిమా సమాజంలో విభజనను పెంచుతోందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన చిత్రం ధురంధర్-2. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇది ఒక అర్థం లేని సినిమా అని ధ్వజమెత్తారు. ఇలాంటి సినిమాల ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాలు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరి దగ్గర అంత సమయం లేదని అన్నారు.
Advertisement
Asaduddin Owaisi
Dhurandhar 2
Asaduddin Owaisi comments
Bollywood movie
Ranveer Singh

More Telugu News