Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కావలసిన ప్రణాళికలను రచించామని అన్నారు. అనంతరం అసెంబ్లీలో మెట్రో స్వాధీనంపై తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఏకగ్రీవం కాదు.. ఏకపక్షం: హరీశ్ రావు
మెట్రో స్వాధీనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని, ఏకపక్ష తీర్మానమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా ఆమోదింపజేస్తారని ప్రశ్నించారు. ప్రకటన చేసే హక్కు ఉంది కానీ, చర్చ లేకుండా సభ్యులంతా ఆమోదించినట్లు ధన్యవాదాలు చెప్పడం సరికాదని అన్నారు.