Hormuz Strait: హర్మూజ్‌లో ఉద్రిక్తత.. నౌకల భద్రతకు ఏకమైన యూరప్, జపాన్
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకలను నిర్ధారించేందుకు యూరప్‌లోని కీలక దేశాలు, జపాన్ ముందుకు వచ్చాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌తో పాటు జపాన్ ఈ మేరకు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశాయి.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన చర్యలను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. "ఇరాన్ తన బెదిరింపులు, మైన్‌లు అమర్చడం, డ్రోన్, క్షిపణి దాడులతో పాటు వాణిజ్య నౌకలను అడ్డుకునే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలి" అని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆ దేశాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకాలు కలిగించడం ప్రపంచ శాంతిభద్రతలకు ముప్పు అని పేర్కొన్నాయి.
ఇరాన్‌తో యుద్ధం 20వ రోజుకు చేరుకోగా, ఈ జలసంధి ప్రస్తుతం దాదాపుగా మూతపడింది. ఇప్పటివరకు 10 ట్యాంకర్లు సహా మొత్తం 23 వాణిజ్య నౌకలపై దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల వల్ల చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగి ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
మరోవైపు, హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరిచేందుకు సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సహా ఇతర దేశాలను కోరారు. అయితే, ఈ దేశాలు ఆయన పిలుపును ప్రస్తుతానికి సున్నితంగా తిరస్కరించాయి. తక్షణ సైనిక చర్యకు బదులుగా చర్చలు, ప్రణాళికలకు సిద్ధమని సంకేతాలిచ్చాయి.