కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

Revanth Reddy in Kerala Assembly Elections Star Campaigner List
  • గోవాలోని పోండా ఉపఎన్నికల క్యాంపెయినర్ల జాబితాలోనూ ముఖ్యమంత్రి పేరు
  • పుదుచ్చేరి ఎన్నికల జాబితాలో తెలంగాణ మంత్రుల పేర్లు
  • కేరళ, అసోం, పుదుచ్చేరిలకు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గోవాలోని పోండా ఉప ఎన్నిక క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన పేరు ప్రకటించారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.

కేరళ, అసోం, పుదుచ్చేరిలకు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల పేర్లు ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.
Revanth Reddy
Kerala Assembly Elections
Congress Party
Telangana CM
Mallu Bhatti Vikramarka

More Telugu News