Balen Shah: నేపాల్ నూతన ప్రధానమంత్రికి భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
నేపాల్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ర్యాప్ గాయకుడు బాలెన్ షాకు (బాలేంద్ర షా) భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మోదీ 'ఎక్స్' వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. "నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనం. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
శుక్రవారం నేపాల్ నూతన ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ పార్టీ నేత బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలెన్ షాను ఆ పదవిలో నియమించినట్లు నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన సమావేశంలో బాలెన్ షాను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆర్ఎస్పీ ఎన్నుకుంది. దీంతో ఆయన దేశ 47వ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. కేవలం 35 ఏళ్ల వయసున్న బాలెన్, నేపాల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కులైన ప్రధానులలో ఒకరిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అధిక శాతం చట్టసభ సభ్యులు యువతరం వారే కావడం నేపాల్ రాజకీయాల్లో తరాల మార్పునకు సంకేతంగా నిలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 28న జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలెన్, యువతలో విపరీతమైన ఆదరణ పొందారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో, ఆర్ఎస్పీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయగా, 275 స్థానాలున్న ప్రతినిధుల సభలో 182 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. తూర్పు నేపాల్లోని ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బాలెన్ షా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓలీకి 18,734 ఓట్లు రాగా, షాకు 68,348 ఓట్లు లభించాయి. 1991 తర్వాత నేపాల్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఒక అభ్యర్థికి లభించిన అత్యధిక ఓట్లు ఇవే కావడం విశేషం.
బాలెన్ షా 2022లో ఖాట్మండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1990 ఏప్రిల్ 27న ఖాట్మండులో జన్మించిన ఆయన, భారత్లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తన హుషారైన ర్యాప్ గీతాలతో యువతలో పాప్యులారిటీ సంపాదించుకున్నారు.