Putin: పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. అమెరికా కదలికలపై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చేరవేత!

Putin Delivers Drones to Iran Providing Intel on US Moves
షార్ట్స్‌లో చూడండి

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా... రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 


పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే..

  • డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు ఈ రవాణా ప్రక్రియ పూర్తి కానుంది. యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఏర్పడిన ఆహారం, ఔషధాల కొరతను తీర్చడానికి కూడా రష్యా తన వంతు సాయం చేస్తోంది.

  • రియల్ టైమ్ ఇంటెలిజెన్స్: అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను రష్యా తన శాటిలైట్ల ద్వారా పర్యవేక్షించి, ఆ సమాచారాన్ని 'రియల్ టైమ్'లో ఇరాన్‌కు చేరవేస్తోంది. దీనివల్ల ఇరాన్ తన క్షిపణి దాడులను మరింత కచ్చితత్వంతో చేయగలుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.

  • బుషెహర్ ప్లాంట్ నుంచి తరలింపు: ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమీపంలో మంగళవారం క్షిపణి పడటంతో రష్యా అప్రమత్తమైంది. అక్కడ పనిచేస్తున్న 163 మంది రష్యా సిబ్బందిని (రోసాటమ్ ఉద్యోగులు) సురక్షితంగా ఇరాన్-ఆర్మేనియా సరిహద్దుకు తరలించింది. ప్రస్తుతం అక్కడ కేవలం పరికరాలను పర్యవేక్షించేందుకు కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు.

మరోవైపు, ఈ వార్తలపై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ... వీటిని నకిలీ వార్తలుగా కొట్టిపారేసింది. అయితే, ఇరాన్ నాయకత్వంతో తమ సంప్రదింపులు నిరంతరం కొనసాగుతున్నాయని, రక్షణ రంగంలో సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.

Go Back to Shorts
Putin
Russia Iran relations
Iran drone delivery
US military intelligence
Geraan-2 drones
Bushehr nuclear plant
Rosatom employees
Iran-Armenia border
Real-time intelligence
Iranian missile attacks

More Telugu News