తమిళనాడులో వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మంది మృతి

20-03-2026 Fri 18:11 | National
Advertisement
  • సేలం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • అదుపుతప్పి మరో లైన్‌లోకి వెళ్లి వాహనాలను ఢీకొట్టిన బస్సు
  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Advertisement
తమిళనాడు రాష్ట్రం, సేలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ఉత్తమసోలాపురం సమీపంలోని అరియనూర్ వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు.

కోయంబత్తూరు నుంచి సేలంకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో 40 మంది ఉన్నారు. ఈ బస్సు అదుపు తప్పి అవతలి లైన్‌ను దాటుకుని మరో లైన్‌లోకి వచ్చి ఎదురుగా వెళుతున్న వాహనాలను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఆటోను, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఓ మహిళ, ఆమె కూతురు ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు.

మృతి చెందినవారిని సెల్వరాజ్, మురుగన్, అముధ, మణికందన్, ఇరుసాయి, సత్య (మణికందన్ భార్య), ఐదేళ్ల నితీష, 11 నెలల జీవికగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులోని కొంతమంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Advertisement
Tamil Nadu Road AccidentSalemBus AccidentRoad AccidentTamil NaduAccident

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more