రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్... హైలైట్స్ పార్ట్ - 1

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. 

దేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7 శాతం ఎక్కువని వెల్లడించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

బడ్జెట్ వివరాలు:
  • మొత్తం బడ్జెట్‌ - రూ.3,24,234 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ.2,34,406 కోట్లు
  • మూలధన వ్యయం - రూ.47,267 కోట్లు
  • ద్రవ్యలోటు - రూ.58,458 కోట్లు
  • తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
  • రైతు సంక్షేమం - రూ.23,179 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు
  • విద్యుత్ - రూ.21,285 కోట్లు
  • విద్యా శాఖ - రూ.26,674 కోట్లు
  • సివిల్ సప్లయ్ - రూ.7,366 కోట్లు
  • పరిశ్రమలు - రూ.3,490 కోట్లు
  • చేనేత - రూ.258 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు
  • రవాణా శాఖ - రూ.12,759 కోట్లు
  • పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు
  • వైద్యం - రూ.13,679 కోట్లు
  • కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు
  • రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు
  • గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు
  • ఐటీ రంగం - రూ.875 కోట్లు
  • న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు.


More Telugu News