హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ మార్గంలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ఈ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటామని స్పష్టం చేశాయి.
గత మూడు వారాలుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య నౌకలపై దాడులు, సముద్రంలో మైన్‌లు అమర్చడం, డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడటం వంటి చర్యలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి.
హర్మూజ్ జలసంధిని అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం అంతర్జాతీయ శాంతిభద్రతలకు పెను ముప్పు అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఐదో వంతు ముడి చమురు, సహజ వాయువు ఈ జలసంధి నుంచే రవాణా అవుతాయి. ఈ మార్గానికి ఆటంకాలు ఏర్పడితే ఇంధన ధరలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని ఈ దేశాలు హెచ్చరించాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, హర్మూజ్ జలసంధిలో భద్రతను పర్యవేక్షిస్తున్న అమెరికా నేతృత్వంలోని దళాలకు మద్దతుగా బ్రిటన్ తన రాయల్ నేవీ యుద్ధనౌకలను ఇప్పటికే మోహరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టేలా ఈ ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేశారు.