Bhadradri Kothagudem: కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Ganja Worth 52 Lakh Seized
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పోలీసులు రూ.52 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన పలువురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో సుమారు 105.54 కిలోల గంజాయిని కార్లలో గుర్తించారు.

వాహనంలో గంజాయి తరలిస్తున్నరనే పక్కా సమాచారంతో జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో రెండు కార్లలో గంజాయి పట్టుబడింది. టీఎస్11 ఈఆర్ 6312, టీఎస్07 జేవై 3959 అనే నెంబర్లతో కూడిన రెండు కార్లను పోలీసులు ఆపారు. ఆ కార్లలో సోదాలు చేయగా దాచి ఉంచిన 52 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కార్లలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కలిమెల, డొంకరాయి ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఈ గంజాయిని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా హైదరాబాద్‌కు తరలించి విక్రయించాలని ప్రయత్నించినట్లు తెలిపారు.

అరెస్టైన ముగ్గురిని నల్గొండ జిల్లాకు చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్ (35), బైరెడ్డి భార్గవ్ (30), రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంకు చెందిన అందేకర్ శ్రీనివాస్ (40)లుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభి, లక్ష్మణ్, ఫరూక్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
Go Back to Shorts
Bhadradri Kothagudem
Ganja Seizure
Telangana Police
Julurpadu
наркотици Trafficking
Kalimela
Donkarai
Hyderabad
Marijuana

More Telugu News