డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!
నెల్లూరు జిల్లాలో మానవత్వం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్‌తో వెళుతున్న లారీ బోల్తా పడగా, ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌కు సాయం చేసే బదులు స్థానికులు కూల్ డ్రింక్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. కేవలం పది నిమిషాల్లోనే లారీలోని లోడ్ మొత్తాన్ని ఖాళీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న ఓ భారీ లారీ బుజబుజ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో లారీలోని కూల్ డ్రింక్ బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అటుగా వెళుతున్న ప్రయాణికులు లారీ డ్రైవర్ పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డుపై పడిన కూల్ డ్రింక్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు. చేతికి అందిన సంచులు, బ్యాగుల్లో బాటిళ్లను నింపుకొని క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవలం 10 నిమిషాల్లోనే లారీ మొత్తం ఖాళీ అవ్వడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచన లేకుండా స్వార్థంతో వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, లారీని, పగిలిన సీసాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.