నంబర్ 7 కాదు, ఇకపై 8.. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను తుపాను సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా తనతో పాటే ప్రయాణిస్తున్న ఐకానిక్ నంబర్ 7 జెర్సీని వదిలేస్తున్నట్లు ఆయన పరోక్షంగా సూచించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ధోనీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఈ ఊహాగానాలకు తెరలేపింది.
"కొన్ని నంబర్లు మనతోనే ఉండిపోతాయి. 7 ఎప్పుడూ నాకో ప్రత్యేక నంబర్. కానీ, ఈరోజు నేను 8కి మారుతున్నాను. ఎందుకో మీకు త్వరలోనే తెలుస్తుంది" అని ధోనీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ధోనీ ఎప్పటికీ నంబర్ 7తోనే ఉండాలని కొందరు కోరుతుండగా, ఇది కేవలం ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో భాగమే అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు, ఆ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా కూడా ధోనీ నంబర్ 7 జెర్సీతోనే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
ఈ జెర్సీ నంబర్ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే, ఐపీఎల్ 2026లో ధోనీ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్‌ను బలంగా నిలబెట్టడమే ధోనీ ప్రధాన పాత్రగా మారిందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "సీఎస్‌కే అనగానే వెంటనే ధోనీనే గుర్తొస్తాడు. అయితే, గత సీజన్‌లో మాదిరిగా 8వ లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పెద్దగా ప్రభావం చూపకపోవడం సరైనది కాదు. అది జట్టులో కేవలం స్థానం నింపడం కోసమే అన్నట్లుగా ఉంది" అని ఏబీడీ విశ్లేషించాడు.
44 ఏళ్ల వయసులోనూ ధోనీలో ఇంకా పరుగులు చేసే సత్తా ఉందని, అతడు కనీసం 6వ స్థానంలో, వీలైతే 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని డివిలియర్స్ సూచించాడు. అప్పుడే అతని అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం జట్టుకు పూర్తిగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నాడు. మొత్తం మీద ఒకవైపు జెర్సీ నంబర్ మార్పుపై ఊహాగానాలు, మరోవైపు వచ్చే సీజన్‌లో అతని పాత్రపై వస్తున్న విశ్లేషణలతో ధోనీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి