ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. 'OG'తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత పవన్ చేసిన ప్రాజెక్టు కావడంతో, ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. పవన్ కల్యాణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాంటి పవన్ కల్యాణ్ ను ఎలా చూపించాలనేది తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్.
పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ను ఆడియన్స్ ఇంకా మరిచిపోలేదు. వసూళ్ల పరంగా ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అందువలన సహజంగానే 'ఉస్తాద్'పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి మరో స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చితే, తమన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. దాంతో ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన ఈ సినిమాపై అభిమానులు మరింత ఉత్సాహంతో ఉన్నారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది పవన్ క్రేజ్ కీ .. బాడీ లాంగ్వేజ్ కి తగిన టైటిల్ అనే విషయం అర్థమైపోతూనే ఉంది. అలాంటి ఈ సినిమాలో శ్రీలీల - రాశి ఖన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. పవన్ తో కలిసి శ్రీలీల చేసిన ఫస్టుమూవీ ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్ ను తెరపై చూడాలనే ఉత్సాహంతో ఫ్యాన్స్ ఉన్నారు. 'ఉగాది' కనుకాగా ఈ నెల 19వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, పవన్ కెరియర్ కి మరో సంచలనాన్ని అందిస్తుందేమో చూడాలి.