సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ
- టీ20 ప్రపంచకప్ విజేత తిలక్ వర్మకు సీఎం రేవంత్ సన్మానం
- హైదరాబాదీ క్రికెటర్‌ను అభినందించిన ముఖ్యమంత్రి
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అజారుద్దీన్, వాకిటి శ్రీహరి
- తిలక్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎటీజీ) చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిలక్ వర్మ విజయం రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.