సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... కేసీఆర్ అభినందనలు

ప్రముఖ కవి, విమర్శకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డిని అత్యున్నత ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 2025’ వరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో తెలుగు విభాగంలో ఆయన రాసిన ‘అనిమేష’ అనే దీర్ఘ కవితా సంపుటికి ఈ గౌరవం దక్కింది.


ఈ సందర్భంగా సిధారెడ్డిని బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ అభినందించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, మట్టి వాసనను తన సాహిత్యంలో అక్షరబద్ధం చేసిన అరుదైన కవి సిధారెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం సమయంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను ‘అనిమేష’ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన ప్రశంసించారు. కేటీఆర్, హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు కూడా నందిని సిధారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News