విశాఖలో పేలిన బాణసంచా.. దద్దరిల్లిన గోపాలపట్నం

Andhra
Advertisement
  • విశాఖ గోపాలపట్నంలో అక్రమ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు
  • పలు ఇళ్లు ధ్వంసం, ఒక మహిళకు గాయాలు
  • నిందితుడు బాంబుల శివ పరారీ, కేసు నమోదు చేసిన పోలీసులు
  • పేలుడు శబ్దం మూడు కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికుల వెల్లడి
Advertisement
విశాఖ నగరం భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గోపాలపట్నం పరిధిలోని మహాత్మా ఆదర్శనగర్‌లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి పేలింది. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం కాగా, స్థానికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

స్థానికంగా ‘బాంబుల శివ’గా పిలిచే డి.శివకృష్ణకుమార్ (40) అనే వ్యక్తి శ్మశానవాటిక సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ నెల 18న జరగనున్న ఉత్సవాల కోసం పెద్దఎత్తున మందుగుండు సామగ్రిని నిల్వ చేశాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఆ ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వచ్చి, వెంటనే భారీ పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుడు ధాటికి భవనం గోడలు కూలిపోయి, సమీపంలోని రేకుల షెడ్లపై పడ్డాయి. చుట్టుపక్కల ఇళ్ల గోడలకు కూడా పగుళ్లు వచ్చాయి. ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనంతో పాటు ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. శ్లాబ్ పెచ్చులు మీద పడటంతో ఓ మహిళ స్వల్పంగా గాయపడగా, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం తర్వాత నిందితుడు శివ పరారయ్యాడు. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

D Shiva Krishna KumarVisakhapatnamGopalapatnamfirecrackers explosionillegal storagefire accidentAndhra Pradeshbomb blastfirecrackers manufacturingpolice investigation

More Telugu News

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

సెంచరీలు కాదు.. 43 పరుగుల ఇన్నింగ్సే బెస్ట్‌.. కోహ్లీ ఎంపిక వెనుక ఆసక్తికర కారణం

05 Nov, 12:40

ఓటేసిన పరిటాల కుటుంబం.. వైసీపీపై సునీత విమర్శలు

05 Nov, 12:37

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసిన బోయపాటి శ్రీను

05 Nov, 12:24

ఒంటిపై పాములు, త్రిశూలాలు.. యశ్‌ 'రావణ' పాత్ర ఆభరణాల ప్రత్యేకతలివే!

05 Nov, 12:23

ఒబామా తర్వాత డెమోక్రాట్ల ఆశాకిరణం.. 2028 అధ్యక్ష రేసులో జాన్ ఒసాఫ్‌ పేరు!

05 Nov, 12:21

హత్య కేసు నిందితుడికి బెయిల్.. బైక్ ర్యాలీతో హీరోలా స్వాగతం!

05 Nov, 12:17

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శబరిని ఎందుకు వదిలేశారంటూ వైసీపీ ప్రశ్న

05 Nov, 12:01

చాహల్‌పై ఆర్‌జే మహ్వష్ ఆరోపణలు చేశారా?.. వైరల్ క్లిప్‌లోని అసలు నిజమిదే!

05 Nov, 11:58

విమానం బాత్రూంలో ఇమడలేకపోయిన పొడగరి.. కానీ నెటిజన్లు ఫోకస్ వేరే!

05 Nov, 11:50

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42
..More Telugu News