దేవుడిలా వచ్చి నన్ను నిలబెట్టారు: పవన్ కల్యాణ్ పై హరీశ్ శంకర్ భావోద్వేగం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అశేష అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ఆలస్యానికి మరెవరో కాదని, తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
"అందరికీ నమస్కారం. కొన్ని మాటలే మాట్లాడతాను కానీ, కొన్ని నిజాలు చెప్పాలి. ముందుగా అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే. సినిమా అనుకున్నదానికంటే ఆలస్యం అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ, ఆ ఆలస్యానికి కారణం నేనే. మొదట ‘ఖుషి’కి ఎక్స్‌టెన్షన్‌లా కాలేజీ నేపథ్యంలో కథ అనుకున్నాం. కానీ అది నాకు పూర్తి సంతృప్తినివ్వలేదు. కథ మార్చడం, స్క్రిప్ట్ మీద పనిచేయడం, మధ్యలో కోవిడ్ వంటి కారణాలతో సినిమా ఆలస్యమైంది. ఈ సినిమా ఆలస్యమవడానికి ఎంత కారణమో, చివర్లో అంత వేగంగా పూర్తి చేయడానికి కూడా నేనే కారణం.
ఈ ప్రయాణంలో నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను తమ భుజాలపై మోశారు. నిజానికి వాళ్ల ఎత్తుకు భుజాలపై మోస్తే బ్యాలెన్స్ ఉండదు, అందుకే వాళ్లు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా వాళ్లు డ్రీమ్ ప్రొడ్యూసర్స్. నేను 500 మంది డ్యాన్సర్లను అడిగితే, వాళ్లు 1500 మందిని పెట్టుకుందాం అనేవాళ్లు. ప్రతి దర్శకుడి కలను నిజం చేసే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. మీ పాషన్‌కు, దర్శకుడిని మీరు చూసుకునే విధానానికి తలవంచి నమస్కరిస్తున్నాను.
ఒకానొక దశలో నా గత సినిమా సరిగ్గా ఆడకపోవడం, పాండమిక్ వంటి కారణాలతో మానసికంగా చాలా లోలో ఉన్నాను. కనీసం నిలబడటమే కష్టమనుకున్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. అలాంటి సమయంలో, గజేంద్ర మోక్షంలో ఏనుగు కోసం శ్రీహరి వచ్చినట్టు, నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి, "త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో" అన్నారు. ఆ ఒక్క పిలుపుతో నా గాయాలన్నీ మాయమైపోయాయి. షూటింగ్ మొదలయ్యాక ఆయన చూపిన కమిట్‌మెంట్ మాటల్లో చెప్పలేను. ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అనేది నా పాత డైలాగ్. కానీ, ‘కమిట్‌మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది’ అని పవన్‌ను చూశాక నా డైలాగ్ మార్చుకుంటున్నాను. ఆయన కటౌట్‌ను మనమంతా గుండెల్లో పెట్టుకున్నాం.
ఇక పాటల విషయానికొస్తే, చాలామంది ‘కెవ్వుకేక’ లాంటి పాట ఉంటుందా అని అడుగుతున్నారు. గబ్బర్ సింగ్ నాటి పరిస్థితులు వేరు, ఇప్పటివి వేరు. ఇప్పుడు పవన్ గారి ఇమేజ్‌కు ఐటమ్ సాంగ్ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. పాటైనా, ఆటైనా ఒక సందేశం ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ఈ చిత్రంలోని పాటలు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి. నా రైటింగ్, డైరెక్షన్ టీం ముఖ్యంగా దశరథ్ గారు, రమేష్ రెడ్డి గారు, నా కుడి, ఎడమ భుజాల్లాంటి అఖిల్, రవి, నా గుండెకాయ లాంటి కో-డైరెక్టర్ బాబీ.. వీళ్లంతా నాకు అండగా నిలిచారు.
చివరగా ఒక్కమాట. పవన్‌ను దేవుడు అనడంపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మనం స్నేహితుడినో, బంధువునో సమయానికి ఆదుకుంటే ‘దేవుడిలా వచ్చావురా’ అంటాం. సచిన్‌ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అన్నట్టు, ఇది అభిమానంతో పిలుచుకునే పిలుపు మాత్రమే. అంతకుమించి ఇందులో వేరే ఉద్దేశం లేదు. నన్ను ఇంతసేపు భరించినందుకు, ప్రేమించినందుకు ధన్యవాదాలు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. థాంక్యూ" అంటూ హరీశ్ శంకర్ తన ప్రసంగాన్ని ముగించారు.