'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'పెద్ది' డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ భారీ సినిమా చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా, ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షూటింగ్ ముగించుకుని ఈవెంట్‌కు వెళుతున్నానని చరణ్‌కు చెప్పగా, ఆయన తన తరఫున ఒక ముఖ్యమైన విషయాన్ని వేదికపై చెప్పమని కోరారని బుచ్చిబాబు వివరించారు. "తండ్రి చిరంజీవి నుంచి నేర్చుకున్నదానికంటే బాబాయ్ పవన్ కల్యాణ్ నుంచి 100 రెట్లు ఎక్కువ నేర్చుకున్నానన్న విషయం ఈ వేదికపై చెప్పమని చరణ్ సార్ ప్రత్యేకంగా సూచించారు" అని బుచ్చిబాబు తెలపడంతో ప్రాంగణం దద్దరిల్లింది.
అంతేకాకుండా, తాను దర్శకుడు కావడానికి పవన్ కల్యాణే స్ఫూర్తి అని బుచ్చిబాబు ఎమోషనల్ గా మాట్లాడారు. కాకినాడలో ఇంటర్ చదివే రోజుల్లో తన స్నేహితుడు ‘తొలిప్రేమ’ సినిమా చూసి మైమరిచిపోయాడని, అప్పుడే తాను దర్శకుడిగా కావాలని నిర్ణయించుకున్నానని గుర్తు చేసుకున్నారు. ‘తొలిప్రేమ’లోని ‘మిస్ లైలా’ పాటను కూడా వేదికపై పాడి వినిపించి అభిమానులను ఉత్సాహపరిచారు.
పిఠాపురంలో పుట్టిన తనకు, పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉందని అన్నారు. "ఇక్కడ ఉన్న అందరికీ ఆ అదృష్టం ఉందో లేదో కానీ, ‘మా ఎమ్మెల్యే కల్యాణ్ గారు’ అని చెప్పుకునే అదృష్టం నాకు ఉంది" అని బుచ్చిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు హరీశ్ శంకర్‌ను ప్రశంసిస్తూ, ఆయనలో 50 శాతం పవన్ కల్యాణ్ కనిపిస్తారని కొనియాడారు. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని బుచ్చిబాబు ఆకాంక్షించారు.