'ఉస్తాద్ భగత్ సింగ్' జాతర మొదలు... హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తుండటంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అంతకుముందు, శనివారం సాయంత్రం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పటికే టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, ట్రేడ్ అనలిస్టుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో పాటలకు సంగీతం అందించడం ఒకెత్తయితే, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం మరో ఎత్తు. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 


More Telugu News