ఈ వారం భారీ నష్టాలు ఎదుర్కొన్న ఎస్‌బీఐ... అత్యధికంగా రూ.89 వేల కోట్ల లాస్
గతవారం స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనం దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధికంగా నష్టపోయింది. ఒక్కవారంలోనే ఎస్ బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ.89,306.22 కోట్లు తగ్గి రూ.9,66,261.05 కోట్లకు పడిపోయింది. మొత్తంగా దేశంలోని టాప్-10 కంపెనీలు కలిపి రూ.4.48 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అన్ని రంగాల్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్లు, నిఫ్టీ 1,299 పాయింట్లు నష్టపోయాయి.
ఎస్‌బీఐ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.61,715 కోట్లు తగ్గి రూ.12,57,391 కోట్లకు చేరింది. అలాగే, బజాజ్ ఫైనాన్స్ రూ.59,082 కోట్లు, టీసీఎస్ రూ.53,312 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.42,205 కోట్ల చొప్పున తమ మార్కెట్ విలువను కోల్పోయాయి.
వీటితో పాటు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు కూడా వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయి. అయితే, రూ.33,289 కోట్ల నష్టం ఎదురైనప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.