ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో భారత్ హవా.. మూడో స్థానంలో 229 మంది

Business
Advertisement
  • అగ్రస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా
  • స్వశక్తితో అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్‌గా భారత సంతతి యువకుడు
  • కొత్తగా జాబితాలోకి టెన్నిస్ స్టార్ ఫెదరర్, సింగర్ బెయాన్సే
  • తొలిసారిగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి కుబేరులకు చోటు
Advertisement
ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 229 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచి తన సత్తాను చాటింది. ఇటీవల విడుదలైన ఈ నివేదిక ప్రకారం అమెరికాలో 989 మంది, చైనాలో 610 మంది కుబేరులు ఉన్నట్లు వెల్లడైంది.

గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 390 మంది ఈ జాబితాలో చేరడంతో మొత్తం కుబేరుల సంఖ్య 3,400 దాటింది. అంటే సగటున రోజుకు ఒకరు బిలియనీర్‌గా మారారన్నమాట. భారత్ తర్వాత జర్మనీ (212), రష్యా (147) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల నుంచి కూడా తొలిసారిగా బిలియనీర్లు చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ జాబితాలో యువత సత్తా చాటడం మరో ముఖ్యమైన అంశం. భారత సంతతికి చెందిన 22 ఏళ్ల సూర్య మిధా, స్వశక్తితో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. తన స్నేహితులతో కలిసి స్థాపించిన 'మెర్కార్' అనే ఏఐ రిక్రూటింగ్ టూల్ అతడిని ఈ స్థాయికి చేర్చింది. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల అమెలీ వోయిగ్ట్ ట్రెజెస్ వారసత్వ సంపదతో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన బిలియనీర్‌గా నిలిచారు.

వీరితో పాటు పలువురు ప్రముఖ సెలబ్రిటీలు కూడా 2026లో బిలియనీర్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. వీరిలో అమెరికన్ పాప్ సింగర్ బెయాన్సే, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, ర్యాపర్ డాక్టర్ డ్రే, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ వంటి వారు ఉన్నారు.
 
Advertisement

సంబంధిత వార్తలు

ForbesForbes Billionaires ListIndian BillionairesRichest People 2026Surya MidhaBeyonceRoger FedererJames CameronGlobal BillionairesIndia Economy

More Telugu News

‘ఆర్ఆర్‌ ట్యాక్స్‌’ నిజమే అయితే చర్యలేవి? మోదీ, షాలకు కేటీఆర్‌ ప్రశ్న

05 Nov, 13:37

రావణుడిగా యశ్ విశ్వరూపం.. అద్భుత నటనతో కట్టిపడేసిన రాకింగ్ స్టార్.. రామాయణలో యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా!

05 Nov, 13:20

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

05 Nov, 13:09

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

సెంచరీలు కాదు.. 43 పరుగుల ఇన్నింగ్సే బెస్ట్‌.. కోహ్లీ ఎంపిక వెనుక ఆసక్తికర కారణం

05 Nov, 12:40

ఓటేసిన పరిటాల కుటుంబం.. వైసీపీపై సునీత విమర్శలు

05 Nov, 12:37

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసిన బోయపాటి శ్రీను

05 Nov, 12:24

ఒంటిపై పాములు, త్రిశూలాలు.. యశ్‌ 'రావణ' పాత్ర ఆభరణాల ప్రత్యేకతలివే!

05 Nov, 12:23

ఒబామా తర్వాత డెమోక్రాట్ల ఆశాకిరణం.. 2028 అధ్యక్ష రేసులో జాన్ ఒసాఫ్‌ పేరు!

05 Nov, 12:21

హత్య కేసు నిందితుడికి బెయిల్.. బైక్ ర్యాలీతో హీరోలా స్వాగతం!

05 Nov, 12:17

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శబరిని ఎందుకు వదిలేశారంటూ వైసీపీ ప్రశ్న

05 Nov, 12:01

చాహల్‌పై ఆర్‌జే మహ్వష్ ఆరోపణలు చేశారా?.. వైరల్ క్లిప్‌లోని అసలు నిజమిదే!

05 Nov, 11:58
..More Telugu News