Thummala Nageswara Rao: ఆయిల్ పామ్ పంట వేయండి... మార్కెట్ సమస్య లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Thummala Nageswara Rao Encourages Oil Palm Farming with Guaranteed Market
రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదని అన్నారు. అన్ని విధాలా రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని వెల్లడించారు. సిద్దిపేట, జనగామ జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ అందిస్తున్నామని తెలిపారు. తాను మంత్రిగా వచ్చిన సమయానికి ఆయిల్ పామ్ టన్ను రూ.12 వేలు ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టన్ను ధర రూ.20 వేలకు పైగా పెంచామని చెప్పారు. నర్మెట్టలో త్వరలో రైతు మేళా నిర్వహిస్తామని అన్నారు.
Thummala Nageswara Rao
Oil Palm Farming
Telangana Agriculture
Ponnam Prabhakar
Narmetta Oil Palm Factory

More Telugu News