సింగపూర్ నుంచి డ్రోన్ల అక్రమ రవాణా.. శంషాబాద్ లో 70 డ్రోన్లు పట్టివేత
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 70 డ్రోన్లను ఈ రోజు పట్టుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో వీటిని తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను గుర్తించిన అధికారులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రోన్ల విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రోన్లను ఎందుకు తీసుకువస్తున్నారు? దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ముదురుతుండటం వల్ల అక్కడి గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనితో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారడంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.