'ధురంధర్ 2'ను వదులుకున్న అనిల్ కపూర్.. కారణం ఇదే!

Anil Kapoor Drops Dhurandar 2 Here is the Reason
  • వృత్తి నిబద్ధతను చాటుకున్న అనిల్ కపూర్
  • మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చినందువల్ల 'ధురంధర్ 2'ను వదులుకున్నానని వెల్లడి
  • ఇచ్చిన మాట మీద నిలబడటం కూడా చాలా ముఖ్యమని వ్యాఖ్య

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తన వృత్తి నిబద్ధతను చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 19న విడుదల కాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ధురంధర్ 2’లో తాను ఒక కీలకమైన అతిథి పాత్రను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించాలని తనకు ఉన్నప్పటికీ, అప్పటికే మరో దర్శకుడికి ఇచ్చిన డేట్స్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.


పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... క్రమశిక్షణ, ఇచ్చిన మాట మీద నిలబడటం కూడా చాలా ముఖ్యమని అనిల్ కపూర్ అన్నారు. ఒకరికి ఇచ్చిన డేట్స్‌ను రద్దు చేసి మరో సినిమాను అంగీకరించడం తన నైతికతకు విరుద్ధమని, అందుకే ఆ అవకాశాన్ని కోల్పోయినా బాధపడటం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆదిత్య ధర్ దర్శకత్వంలో పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.

Go Back to Shorts
Anil Kapoor
Dhurandar 2
Aditya Dhar
Bollywood
Movie Release
Film Industry
Acting Career
Commitment
Dates
Ethics

More Telugu News