Patancheru: పటాన్‌చెరులో జంట హత్యల కలకలం.. వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య

Watchman Couple Brutally Murdered in Patancheru Double Homicide
హైదరాబాద్ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం మహబూబాబాద్ జిల్లా దొంగచింత తండాకు చెందిన సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45) దంపతులు జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్లుగా చేరి, అక్కడే నివాసం ఉంటున్నారు.

శనివారం ఉదయం పనుల కోసం వచ్చిన నిర్మాణ సిబ్బంది, దంపతులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Patancheru
Double Murder
Watchman Couple Murder
Somla Dasharath
Sangareddy District
Hyderabad Crime
Telangana Crime News
Citizen Colony
Crime Investigation

More Telugu News