Raghurama Krishnam Raju: రఘురామ చిత్రహింసల కేసు: విచారణకు హాజరు కావాల్సిందే.. పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశాలు
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న గత ప్రభుత్వంలోని నిఘా విభాగం మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు విచారణకు హాజరుకావాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరించాలని ఆదేశించింది.
పీఎస్సార్ ఆంజనేయులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా, కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్తో కలిపి ఆంజనేయులును విచారించాల్సి వుండచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, విచారణ సమయంలో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించారు.
2025 జులై నుంచి పెండింగ్లో ఉన్న ఈ పిటిషన్ను న్యాయస్థానం పరిష్కరించింది. అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని కోర్టు పేర్కొంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 జులై 11న గుంటూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.