హెచ్‌జే దొర మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది: చంద్రబాబు

Chandrababu Condoles Death of Former DGP HJ Dora
  • ఈరోజు కన్నుమూసిన ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర
  • ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో కీలకపాత్ర పోషించారన్న చంద్రబాబు
  • నక్సల్స్ పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కితాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... హెచ్‌జే దొర మృతి వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. "ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, నా హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. 

హెచ్‌జే దొర కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
HJ Dora
Chandrababu Naidu
Andhra Pradesh DGP
Former DGP
NTR
Naxal Problem
Kidney Ailment
NIMS Hospital
Death
Obituary

More Telugu News