ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీలో సందడి చేసిన క్రికెటర్ అభిషేక్ శర్మ
- టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
- అభిషేక్ శర్మను ఆహ్వానించిన ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం
- అభిషేక్‌కు, టీమిండియాకు ఫ్రాన్స్ అభినందనలు
- రాబోయే ఐపీఎల్ సీజన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంబసీ
టీమిండియా యంగ్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సందడి చేశాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీలో చారిత్రక విజయం సాధించిన భారత జట్టులో అభిషేక్ కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది.
వరల్డ్ కప్ గెలిచినందుకు అభిషేక్ శర్మకు, టీమిండియాకు ఫ్రాన్స్ ఎంబసీ అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన అభిషేక్‌ను తమ కార్యాలయానికి స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అభిషేక్‌తో కాసేపు ముచ్చటించిన అధికారులు, రాబోయే ఐపీఎల్ సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఫ్రాన్స్ ఎంబసీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.