Narendra Modi: రూ.22 వేల పెట్టుబడితో రూ.3.5 లక్షల ఆదాయం: మోదీ ఏఐ వీడియోపై స్పందించిన కేంద్రం

Narendra Modi AI Video Claiming High Returns is Fake Says Government
  • ఈ వీడియో నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడి
  • ఆ వీడియోల కింద ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచన
  • మోదీ మాట్లాడుతున్నట్లుగా ఉన్నది ఏఐ జనరేటెడ్ వీడియో అని వెల్లడి
రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3.5 లక్షల ఆదాయం పొందేలా ఒక పెట్టుబడి పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రసారమవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వీడియో నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. గత కొంతకాలంగా పెట్టుబడి పథకాల పేరిట సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోను సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

ఆ వీడియోల కింద ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్ళు సూచిస్తున్నారు. వాటిపై క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశముంది. ఈ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవి ఏఐ జనరేటెడ్ నకిలీ వీడియోలని వెల్లడించింది. 

ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్లుగా ఏఐ ద్వారా డిజిటల్‌గా సృష్టించిన ఈ వీడియో పూర్తిగా నకిలీదని తెలిపింది. ప్రధాని మోదీ లేదా ప్రభుత్వం ఇలాంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని, ప్రోత్సహించలేదని తెలిపింది. ఇలాంటి పోస్టులతో ఉన్న లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, అలాగే మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఏఐ ఆధారిత ఆర్థిక మోసాలకు గురికావొద్దని అప్రమత్తం చేసింది.
Narendra Modi
PIB Fact Check
Cyber Fraud
Deepfake Video
Investment Schemes
Nirmala Sitharaman

More Telugu News