Sunil Naik: విచారణకు డుమ్మా కొట్టిన ఐపీఎస్ సునీల్ నాయక్.. నేటి బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ

Sunil Naik Skips Inquiry Bail Petition Verdict Awaited
  • సునీల్ నాయక్ విచారణ గడువును ఈరోజు వరకు పొడిగించిన హైకోర్టు
  • నేటి విచారణకు సునీల్ నాయక్ హాజరు కాకపోవడంపై సందేహాలు
  • సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పును వెలువరించనున్న హైకోర్టు

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్... ఏపీ హైకోర్టు ఆదేశించినప్పటికీ నేటి పోలీసు విచారణకు హాజరు కాలేదు.


ఈ నెల 9 వరకు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకు ముందు ఆదేశించింది. ఆ గడువు ముగియడం, సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ అర్హతపై హైకోర్టు వాదనలు వినడం ఆ రోజే జరిగిపోయాయి. అయితే, విచారణాధికారి అభ్యర్థన మేరకు విచారణ గడువును మార్చి 12 (ఈరోజు) వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువులో నేడు ఆఖరి రోజు అయినప్పటికీ, సునీల్ నాయక్ విచారణకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గైర్హాజరుపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఒకవైపు విచారణకు దూరంగా ఉన్న సునీల్ నాయక్, మరోవైపు న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అర్హత పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Sunil Naik
Raghurama Krishnam Raju
AP High Court
Custodial Torture Case
Andhra Pradesh
YSRCP
Bail Petition
Police Investigation

More Telugu News