Javed: జీతం ఇవ్వలేదని గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. యూపీలో ఘటన

Jhansi gas cylinder theft Javed and gang arrested
  • ట్రక్కు యజమాని వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ల నిర్వాకం
  • సిలిండర్లను ఓ ఏజెన్సీ యజమానికి అమ్మిన వైనం
  • ఏజెన్సీ యజమాని సహా ఏడుగురు నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ల ట్రక్కు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ భారీ చోరీకి పాల్పడిన ఏడుగురు నిందితులను సిప్రి బజార్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి చోరీకి గురైన మొత్తం 524 ఎల్‌పీజీ సిలిండర్లతో పాటు రూ.11.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో ఈ చోరీ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన జావేద్, రితిక్ గతంలో అదే ట్రక్కు యజమాని వద్ద డ్రైవర్లుగా పనిచేశారు. తమకు రావాల్సిన సుమారు 70 వేల రూపాయల జీతం బకాయిలను యజమాని ఇవ్వకపోవడంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో గ్యాస్ ప్లాంట్ బయట ఉన్న ట్రక్కును వీరు అపహరించారు.


చోరీ చేసిన సిలిండర్లను నిందితులు ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతార్‌లోని ‘శివ గ్యాస్ ఏజెన్సీ’ యజమానికి రూ. 13 లక్షలకు విక్రయించారు. ఈ లావాదేవీలో భాగస్వాములైన ఏజెన్సీ యజమానిని, మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 379 నిండుగా ఉన్న సిలిండర్లు, 135 ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్ఎస్పీ 25 వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
Javed
Jhansi Uttar Pradesh
gas cylinder theft
truck hijacking
crime news
police investigation
Shiv Gas Agency
salary dues
Uttar Pradesh crime
Samatarr

More Telugu News