వెలుగుమట్ల బాధితులకు 'ఇందిరమ్మ' భరోసా.. డిసెంబర్ 9న గృహప్రవేశాలు!

Telangana
Advertisement
  • 412 మంది బాధితులకు ఇళ్ల మంజూరు పత్రాలు
  • డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  • మిగిలిన 16 ఎకరాల్లో పబ్లిక్ స్కూల్, గురుకులాలు
  • పేదల సొమ్ము వసూలు చేసే ముఠాలపై ఉక్కుపాదం
  • సకల వసతులతో వెలుగుమట్లలో కొత్త లేఅవుట్
  • పేదోడి ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యమన్న భట్టి విక్రమార్క
Advertisement
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి బాధితులకు ఇళ్ల పట్టాలు, మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు చట్టబద్ధంగా, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

సకల వసతులతో 'మోడల్ కాలనీ'
వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారిలో తొలి విడతగా 412 మందిని అర్హులుగా గుర్తించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని 311 మందికి వెలుగుమట్లలోనే ఇళ్లు కేటాయించారు. మిగిలిన 101 మందికి వారి వారి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఈ కాలనీని అన్ని మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రులు ప్రకటించారు. నేటి నుంచే నిర్మాణ పనులు ప్రారంభించి, డిసెంబర్ 9న (సోనియా గాంధీ పుట్టినరోజు) సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశాలు చేయిస్తామని వెల్లడించారు.

దళారుల ముఠాపై ఉక్కుపాదం
పేదల సంఘాల ముసుగులో భూములు ఆక్రమించి, పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారులను వదిలిపెట్టేది లేదని మంత్రులు హెచ్చరించారు. ఆ ముఠాల నుంచి పేదల డబ్బును తిరిగి ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు.

విద్యా రంగానికి పెద్దపీట
వెలుగుమట్లలో ఇళ్ల కేటాయింపు తర్వాత మిగిలిన 16 ఎకరాల భూమిని ఇతరులకు ఇవ్వకుండా.. అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్, గురుకుల పాఠశాలలను నిర్మిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bhatti VikramarkaVelugumatlaIndiramma HousesKhammamTumala Nageswara RaoPonguleti Srinivas ReddyTelangana Housing SchemeSonia Gandhi BirthdayModel ColonyLand Mafia

More Telugu News

క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోం మంత్రి అనిత

05 Nov, 15:04

విజువల్ వండర్.. 'రామాయణ'పై రాజమౌళి రివ్యూ

05 Nov, 15:02

పార్లమెంటుకు రండి చర్చిద్దాం.. రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌!

05 Nov, 15:01

వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

05 Nov, 14:40

పరిషత్ పోలింగ్‌లో ఉద్రిక్తత.. బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నేతలు!

05 Nov, 14:18

'యు కాంట్ సీ మీ'.. జాన్ సేనా స్టైల్‌లో కివీస్ బ్యాటర్‌ను ఆటపట్టించిన కోహ్లీ.. వీడియో వైరల్!

05 Nov, 14:08

తిరుమల లడ్డూ కేసు విచారణ ఏపీలోనే.. బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

05 Nov, 13:56

ముంబయి ఇండియన్స్‌లో హార్దిక్‌ ఒంటరిగా ఫీలయ్యాడా? అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

05 Nov, 13:53

సీజేపీకి విదేశీ నిధులు.. దేశంలో అశాంతికి కుట్ర: కేంద్రం సంచలన ఆరోపణలు

05 Nov, 13:46

‘ఆర్ఆర్‌ ట్యాక్స్‌’ నిజమే అయితే చర్యలేవి? మోదీ, షాలకు కేటీఆర్‌ ప్రశ్న

05 Nov, 13:37

రావణుడిగా యశ్ విశ్వరూపం.. అద్భుత నటనతో కట్టిపడేసిన రాకింగ్ స్టార్.. రామాయణలో యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా!

05 Nov, 13:20

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

05 Nov, 13:09

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56
..More Telugu News