కీరవాణి ఇంట పెళ్లి బాజాలు: కాలభైరవ మనసు గెలిచిన 'బలగం' బ్యూటీ?

  • టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో జంట
  • కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్
  • ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కీరవాణి కుమారుడు, తన గాత్రంతోనూ, సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు... టాలీవుడ్ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది.


వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్. కాలభైరవ 'కార్తికేయ 2' వంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన సత్తా చాటగా, కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి 'మసూద', 'బలగం' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.


ప్రస్తుతం రెండు కుటుంబాల్లో వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ముహూర్తాలు ఖరారైన తర్వాత సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. మెగా, అక్కినేని కుటుంబాల వివాహ వేడుకల సందడి తర్వాత, ఇప్పుడు కీరవాణి ఇంట జరగబోయే ఈ వేడుకపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


Kaala Bhairava
Keeravani son
Kavya Kalyan Ram
Balagam movie
Tollywood wedding
Telugu cinema
marriage news
Karthikeya 2
Masooda movie
celebrity wedding

More Telugu News