Bellamkonda Sreenivas: అది నిశ్చితార్థం కాదు: మీడియాలో వార్తలపై స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Sreenivas Clarifies Engagement Rumors with Kavya Reddy
  • కావ్యతో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించిన బెల్లంకొండ శ్రీనివాస్
  • తన జీవితంలోకి కావ్య రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ పోస్ట్
  • ఆమె ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా చూసుకుంటానని హామీ
  • ఇటీవల జరిగింది ఎంగేజ్‌మెంట్ కాదని కేవలం ఇరు కుటుంబాల కలయిక అని స్పష్టీకరణ
  • త్వరలోనే పెళ్లి వేడుకలకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామన్న యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. కావ్యారెడ్డి అనే అమ్మాయితో తన నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన కాస్తంత రొమాంటిక్ గా స్పందించారు.  

"నా కావ్యమ్మకు... జీవితానికి దానికంటూ ఒక అందమైన సమయం ఉంటుంది... ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చి, నాపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్. నా రోజులను పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరునవ్వులతో నింపేశావు. నీ ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా చూసుకుంటాను. మనమిద్దరం శాశ్వతంగా కలిసి ఉండే ఆ క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ శ్రీనివాస్ తన ప్రేమను వ్యక్తపరిచారు.

అలాగే, ఇటీవల జరిగింది ఎంగేజ్‌మెంట్ కాదని ఆయన స్పష్టం చేశారు. "అందరూ అడుగుతున్నట్లుగా ఇది ఎంగేజ్‌మెంట్ కాదు, కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక చిన్న ప్రకటన మాత్రమే. అసలు వేడుకలు ఇంకా మొదలవ్వలేదు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తాం. మీ ప్రేమ, మద్దతు నాకు ఎంతో ముఖ్యం" అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

శ్రీనివాస్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో జీవితంలో కొత్త అడుగు వేస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే వేడుకల తేదీలు వెలువడే అవకాశం ఉంది.
Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas engagement
Kavya Reddy
Bellamkonda Sreenivas Kavya Reddy
Tollywood news
Telugu cinema news
engagement announcement
Bellamkonda Sreenivas marriage

More Telugu News