K Kavitha: ఏ ఇంట్లో పుట్టినా మహిళలపై వివక్ష ఉంటుంది: జాగృతి అధ్యక్షురాలు కవిత

K Kavitha says discrimination exists against women regardless of their background
  • పెద్దకులం, చిన్నకులమంటూ ఏదీ లేదని మహిళలందరిదీ ఒకే కులమని వ్యాఖ్య
  • మహిళలను ప్రతిరోజు గౌరవించాలన్న కవిత
  • మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమం లేదన్న కవిత
పెద్దకులం, చిన్నకులమంటూ ఏదీ లేదని మహిళలందరిదీ ఒకే కులమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఇంట్లో పుట్టినా సరే వారిపై వివక్ష ఉంటుందని అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. 'గివ్ హర్ స్పేస్' పేరిట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'స్టాండ్ విత్ హర్' కాదు, 'గివ్ హర్ స్పేస్' జాగృతి నినాదమని వెల్లడించారు.

కేవలం మహిళా దినోత్సవం రోజే కాదని, ప్రతిరోజు మహిళని గౌరవించాలని ఆమె సూచించారు. మహిళను తండ్రి, భర్త, అన్న ఇలా అందరూ తక్కువగానే చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదని ఆమె పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధనలోనూ వారి పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించిందని అన్నారు.
K Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Womens Day
Womens Rights
Gender Discrimination

More Telugu News