Dubai: కిటికీలకు దూరంగా ఉండండి: ఇరాన్ దాడుల వేళ దుబాయ్ వాసులకు అలర్ట్

Dubai Residents Alerted Amid Iran Attacks Stay Away From Windows
  • గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడి
  • దుబాయ్‌లో స్థానిక పౌరులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ
  • అత్యవసర పరిస్థితి తలెత్తితే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచన
  • ముందు జాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని సూచన
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా తనపై దాడి చేస్తుండటంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్లు వెల్లడించింది.

దుబాయ్‌లో కూడా స్థానిక పౌరులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుక్రవారం నాడు క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని కొంతమందికి మొబైల్ అలర్ట్ లు వస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ముందుజాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని  సూచించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులకు జాగ్రత్తలు చెబుతోంది.
Dubai
Iran attacks
UAE
Israel
Missile attacks
Dubai alerts
Middle East conflict
US military bases

More Telugu News