వేసవి కాలానికి ఇరాన్ యుద్ధం తోడు.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర
- వేసవి కాలంలో గుడ్ల ధరల తగ్గుదల
- ఆరు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం
- ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మరింత తగ్గిన ధరలు
ఎగుమతులు నిలిచిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ మొత్తంలో నష్టం చేకూరుతుంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేయడం పౌల్ట్రీ పరిశ్రమపై భారీ ప్రభావం పడుతోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ధర రూ.4.20కి పడిపోయింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయింది.