ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్

  • ఐదు రోజుల క్రితం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ మృతి
  • ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి విదేశాంగ కార్యదర్శి
  • సంతాప సందేశం రాసిన విక్రమ్ మిస్రీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం సంతాపం ప్రకటించింది. ఇరాన్ అధినేత ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఐదు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా సంతాప సందేశం రాశారు. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.

సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.


More Telugu News