Iran: అలా చేస్తే ఇజ్రాయెల్ అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటాం: ఇరాన్ హెచ్చరిక

Iran Warns to Target Israel Nuclear Plant if Regime Change Attempted
  • ఆరు రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధం
  • ఇరాన్‌లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగుతుందన్న ఇజ్రాయెల్
  • పాలనను మార్చాలని చూస్తే అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిక
తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య గత ఆరు రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో మృతి చెందారు. ఖమేనీ మృతి చెందిన తర్వాత యుద్ధం మరింత ఉద్ధృతంగా మారింది.

ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాలను చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపివేయవచ్చని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారి ఇరాన్‌లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలకులను మార్చుతామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

తమ దేశంలో పాలనను మార్చే ప్రయత్నం చేస్తే ఇజ్రాయెల్‌లోని అణు ప్లాంటును లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా పశ్చిమాసియాలో చమురు మౌలిక సదుపాయాలను తమ క్షిపణులు లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొంది.
Iran
Israel
Dimona Nuclear Plant
US
Khamenei
Middle East Conflict
Nuclear Threat
Oil Infrastructure

More Telugu News