డప్పు కొట్టి, డ్యాన్సు చేసి.. జగ్గారెడ్డి హోలీ సంబరాలు

  • సంగారెడ్డిలో హోలీ సంబరాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి
  • స్నేహితులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి
  • రామమందిరంలో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన స్నేహితులతో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు. సంగారెడ్డిలో జరిగిన హోలీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్నేహితులు, కార్యకర్తలతో ఆయన పాల్గొన్నారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్యాన్సు చేశారు. స్థానిక రామమందిరం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన చిన్నారులతో పాటు ఆయన చిన్ననాటి మిత్రులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంగారెడ్డి బైపాస్‌లో ఈ హోలీ వేడుకలు నిర్వహించారు.

మరోవైపు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బోయినపల్లిలోని తన నివాసంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. తన చిన్ననాటి నుంచి హోలీ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నానని మల్లారెడ్డి తెలిపారు.


More Telugu News